వాషింగ్టన్: కరోనా సంక్షోభంతో చిక్కుల్లో పడ్డ అమెరికాలోని విదేశీయులకు భారీ ఊరట. అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా సంబంధిత పత్రాలను సమర్పించాలంటూ నోటీసుల జారీ చేసిన హెచ్-1బీ వీసాదారులకు, గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు యుఎస్ సిటిజెన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ శుభవార్త అందించింది. అవసరమైన పత్రాలను సమర్పించడానికి 60 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో రెండు నెలలపాటు ఇమ్మిగ్రేషన్ ను ఇటీవల నిలిపివేయడంతో గ్రీన్ కార్డు కార్డు కోసం ఎదురు చూస్తున్నవారికి రెండు నెలల సమయం దొరికింది. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం 2.5 లక్షల మంది ఎదురు చూస్తుండగా, వీరిలో హెచ్-1బీ వీసాదారులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు.
హెచ్ -1బీ వీసాదారులకు భారీ ఊరట