అవకాశాలు లేక టీవీ నటి ఆత్మహత్య!

పెరంబూరు/చెన్నై: పద్మజ అనే సినీ, బుల్లితెర సహాయ నటి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక తిరువత్తియూర్‌లోని కలాడిపేటలో నివాసముంటున్న పద్మజ (23), పవన్‌రాజ్‌కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నాడు. భార్యభర్తల మధ్య విభేదాలు రావడంతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారు. పిల్లాడు బంధువుల వద్ద పెరుగుతున్నాడు. ఇద్దరూ సెలవు దినాల్లో వెళ్లి బాబుతో గడిపి వస్తున్నారు. అయితే, గతకొంత కాలంగా పద్మజకు అవకాశాలు రావడం లేదు. దీంతో ఆర్థికంగా ఆమె తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. ఇదే విషయమై శనివారం రాత్రి ఆమె తన సోదరితో చెప్పుకుని బాధ పడినట్టు సమాచారం.